మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. చిన్న వివాదం కారణంగా 13 ఏళ్ళ బాలికను ఆమె అత్త నేలపై పడేసి దారుణంగా కొడుతుంది. కొట్టవద్దు ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. బాలికను మోకాళ్ళతో బలంగా అదుముతూ చిత్రహింసలు పెట్టింది. దీనిపై బాధిత బాలిక తాత దీనదయాళ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.