గుండెపోటుతో అయోధ్య ఎస్‌ఐ మృతి

67చూసినవారు
గుండెపోటుతో అయోధ్య ఎస్‌ఐ మృతి
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గుండెపోటుతో మృతి చెందారు. ఎస్సై సురేంద్ర నాథ్ త్రివేది(59) పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద కొందరితో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను శ్రీరామ్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేంద్ర నాథ్ త్రివేది హర్దోయ్ జిల్లా నివాసి. 2023, డిసెంబరు 16న అయోధ్య పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్