నోటిలో దంతాలతో పుట్టిన శిశువు.. షాక్ లో వైద్యులు

82చూసినవారు
నోటిలో దంతాలతో పుట్టిన శిశువు.. షాక్ లో వైద్యులు
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. జూన్ 11న సర్జామడలో నివాసముంటున్న సునీతాదేవి అనే మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారిని చూసిన వైద్యులు షాకయ్యారు. ఈ పిల్లవాడి కింది దవడకి రెండు దంతాలు ఉన్నాయి. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి దంతాలను తొలగించారు. పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. తల్లి పాలివ్వడంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు శిశువు పంటిని తొలగించారు.

సంబంధిత పోస్ట్