పవన్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ సాంగ్ రిలీజ్ వాయిదా

61చూసినవారు
పవన్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ సాంగ్ రిలీజ్ వాయిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ‘హరిహర వీరమల్లు’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా ఇటీవల మూవీలో పవర్ స్టార్ ఆలపించిన ‘మాట వినాలి’ అనే సాంగ్‌ను జనవరి 6న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడం లేదని తెలిపారు. పాట అత్యుత్తమ వెర్షన్‌ని తీసుకొచ్చేందుకు మరి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్