AP: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరిట ప్రభుత్వం మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై మధ్యాహ్న భోజనం మరింత రుచికరం కానుంది. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం ఉపయోగించనుంది. కాగా, ధాన్యం కొనుగోళ్లలో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక మైలు రాయి దాటిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.