తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జైనూర్ లో ఆదివాసి మహిళపై హత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తి పై చర్యలకు డిమాండ్ చేస్తూ.. ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి బంద్‌కు పూనుకుంది. ఆదిలాబాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.