TG: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్‌ను చిక్కడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. మరి చంద్రబాబు ను అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని కేఏ పాల్ అని ప్రశ్నించారు.