సికింద్రాబాద్ MMTS రైలులో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. HYD-యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బీజేపీ మహిళా మోర్చా నాయకులతో కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఘటన జరిగి వారం గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. నిందితులను పట్టుకొని శిక్షించి బాధితురాలిని న్యాయం చేయాలన్నారు.