ఐపీఎల్ 2021లో నేడు కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, ఆర్‌సీబీలు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక లీగ్ మ్యాచ్‌ల్లో రెండుసార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. ప్లేఆఫ్స్‌లో కేకేఆర్, ఆర్‌సీబీ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 13 సార్లు ఆర్‌సీబీ నెగ్గగా.. 15 సార్లు కేకేఆర్ విజయాలు అందుకుంది.