ఉమ్మడి టాయిలెట్ లో నీళ్లు కొట్టకపోవడంతో జరిగిన గొడవలో 18 ఏళ్ల యువకుడిని పొరుగింటివారు కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని గోవిందురిలో జరిగింది. ఛాతీ, తల, ముఖంపై కత్తిపోట్లకు గురైన బాధితుడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ యువకుడు, దాడికి పాల్పడిన కుటుంబం ఒకే భవనంలోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు.