బారామతి ఎంపీ సుప్రియా సూలే ఫోన్, వాట్సాప్ హ్యాక్

80చూసినవారు
బారామతి ఎంపీ సుప్రియా సూలే ఫోన్, వాట్సాప్ హ్యాక్
మహారాష్ట్రలోని బారామతి ఎంపీ సుప్రియా సూలే ఫోన్, వాట్సాప్ హ్యాకింగ్‌కి గురైంది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం సూలే ఎక్స్ వేదికగా తెలిపారు. దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ప్రకటించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) నాయకురాలైన సూలే మాట్లాడుతూ.. ‘నా ఫోన్, వాట్సాప్ హ్యాక్ చేయబడ్డాయి. దయచేసి నాకు కాల్ చేయవద్దు లేదా మెసేజ్ చేయవద్దు. నేను సహాయం కోసం పోలీసులను ఆశ్రయించాను’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్