తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు రచించాలని కోరారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించాలని.. అలాగే వీటి నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని కోరారు.