విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదు: ఏపీ ఈఆర్‌సీ ఛైర్మన్‌

61చూసినవారు
విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదు: ఏపీ ఈఆర్‌సీ ఛైర్మన్‌
AP: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్‌ రామ్ సింగ్ గురువారం ప్రకటించారు. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఠాకూర్‌ 2025-26 ఏడాదికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల టారిఫ్‌లను తాజాగా విడుదల చేశారు. ఏ విభాగంలో కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. మార్చి 31లోపు టారిఫ్‌లు విడుదల చేయాల్సి ఉన్నా.. ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్