ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువతీయువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఇదే కోవలో ఓ యువతి రన్నింగ్ ట్రైన్‌లో డోర్ వద్ద నిల్చుంది. తన ప్రియుడి చేయి పట్టుకుని ట్రైన్ నుంచి బయటకు వేలాడుతూ ప్రయాణించింది. ఆ యువతి తన ప్రాణం కంటే ప్రియుడిని ఎక్కువగా నమ్ముతున్నట్లు చెబుతోంది. ఈ వీడియో @saiba_19 అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. యువతి తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు.