AP: వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టు మాజీ సీఎం జగన్ వ్యవహారశైలి ఉందని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మందుల సరఫరాదారులకు రూ.వెయ్యి కోట్లకుపైగా బకాయిలు పెట్టి వెళితే, కూటమి ప్రభుత్వం చెల్లించిందన్న విషయం ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. బకాయిలు పెట్టి, మందుల సరఫరాను ఆపి, పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది వైసీపీ ప్రభుత్వం అని మంత్రి X వేదికగా తెలిపారు.