USలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ శివారు ప్రాంతంలో ఫిబ్రవరి 18న అనూహ్య ప్రమాదం జరిగింది. 29 ఏళ్ల మహిళ రోడ్డు దాటుతుండగా అమెజాన్ డెలివరీ వ్యాన్ దూసుకొచ్చింది. మహిళను వ్యాన్ డ్రైవర్ ఢీకొట్టి, ఆమెను తొక్కుకుంటూ వెళ్లాడు. బాధతో ఆమె కేకలు వేస్తున్నప్పటికీ ఆమె శరీరంపై నుంచి డ్రైవర్ వ్యాన్‌ను పోనిచ్చాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.