బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో ఒక్కరికి కూడా ఆసీస్ టీమ్‌లోకి ఎంపికయ్యే అర్హత లేదని అన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో కమిన్స్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఉద్దేశించి తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్ నిర్వహించిన చిట్ చాట్‌లో కమిన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.