గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే.. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. ‘‘తల్లిని, చెల్లిని దూషించినా జగన్ పట్టించుకోలేదు. అసెంబ్లీలో ఉచ్ఛరించడానికి వీల్లేకుండా వర్రా రవీందర్‌రెడ్డి పోస్టులు పెట్టారు. భవిష్యత్‌లో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.