చలికాలంలో మూగజీవాల సంరక్షణ అన్నదాతలకు ఓ పెద్ద సమస్య. ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలతో పశువులు వ్యాధుల బారీన పడే అవకాశం ఉంటుంది. అయితే రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే కొంతమేర ఫలితం ఉంటుంది.
పశువుల పాకల్లో అడుగున వేసిన ఎండుగడ్డిని ప్రతిరోజు మార్చుకోవాలి. అలాగే పొదుగు వ్యాధి రాకుండా పాలు పిండిన తర్వాత చన్నులను అయోడిన్ ద్రావణంలో ముంచడం మంచిది. ప్రతి పశువుకు రోజుకు 80 గ్రాములు ఆవశ్యక లవణాలు అందిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.