రంజాన్ వేళ కర్రలతో కొట్టుకున్నారు (వీడియో)

77చూసినవారు
హర్యానాలోని నుహ్‌లో సోమవారం ఈద్ ప్రార్థనల తర్వాత ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య హింస చెలరేగింది. ఈ ఘర్షణలో ఐదుగురికి పైగా గాయపడ్డారు. దర్గాలో నమాజ్ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఇరు గ్రూపుల సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం హింసకు దారితీసింది. ఇరువర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసి.. ముగ్గురిని అరెస్టు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్