ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ ముఠా కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీరి ఉచ్చులో చిక్కుకొని ఎంతో మంది పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు. బెట్టింగ్‌ల కోసం బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టేవారు కొందరైతే, లోన్ యాప్‌లు, ప్రైవేట్ ఫైనాన్షియర్ల వద్ద వడ్డీలకు తెచ్చేవారు మరికొందరు. ఆఖరికి అప్పులు తీర్చలేక కొందరు ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.