జాగ్రత్త.. పెరగనున్న ఎండలు

59చూసినవారు
జాగ్రత్త.. పెరగనున్న ఎండలు
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సోమవారంతో పోలిస్తే మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నట్లు వెల్లడించింది. అలాగే, బుధవారం కొన్ని జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా సోమవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత పోస్ట్