తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ రూ.25 లక్షల విరాళం అందించింది. మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి రామ్ మోహన్ రావు పలువురు ప్రతినిధులు సచివాలయంలో CM రేవంత్ కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కారు చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు సీఎం వారిని అభినందించారు.