భట్టి విక్రమార్కకు కృతజ్ఞత లేదు: వీహెచ్

73చూసినవారు
భట్టి విక్రమార్కకు కృతజ్ఞత లేదు: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు అంబర్‌పేట్‌లోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు మౌన దీక్ష చేపట్టనున్నారు. శనివారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని దీక్షకు దిగబోతున్నట్లు తెలిపారు. కాగా రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత భట్టి విక్రమార్కకు లేదని, ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్