ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండి వేదికగా మంగళవారం జరగనున్న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో టాస్ ఆలస్యం కానుంది. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న రావల్పిండి స్టేడియంలో చిన్నపాటి వర్షం కురుస్తోంది. వర్షం చిన్నపాటిదైనా ఆగకుండా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-బి నుంచి సెమీస్‌కు క్వాలిఫై కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.