సూట్‌కేస్‌‌‌లో శరీర భాగాలు.. అడ్డంగా దొరికిపోయిన మహిళలు

52చూసినవారు
సూట్‌కేస్‌‌‌లో శరీర భాగాలు.. అడ్డంగా దొరికిపోయిన మహిళలు
కోల్‌కతాలోని అహిరిటోలా వద్ద షాకింగ్ ఘటన బయటపడింది. ఇద్దరు మహిళలు సూట్‌కేసులో మానవ శరీర భాగాలను తీసుకొచ్చి హుగ్లీ నదిలో విసిరేందుకు ప్రయత్నించారు. అది గమనించిన స్థానికులు ప్రశ్నించగా.. సూట్‌కేసులో కుక్క శరీర భాగాలు ఉన్నాయని జవాబు ఇచ్చారు. కానీ వారికి అనుమానం రావడంతో సూట్‌కేస్‌ను తెరిచి చూశారు. అందులో మానవ శరీర భాగాలు చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్