తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్‌లోని ఓ దేవాలయంలో గల ఏనుగు పిల్ల తన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటోంది. దేవాలయంలో రోజు వారి మాదిరిగా భజన ప్రారంభించారు. అయితే భజన పాటకు తగ్గట్లుగా ఏనుగు పిల్ల స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిని దేవాలయంలోని ఒకతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.