సాయంత్రం కాగానే అసౌకర్యంగా ఉండడం, ఆందోళనకు గురికావడాన్ని సన్‌సెట్ యాంగ్జైటీ అని పిలుస్తారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఈ మానసిక రుగ్మతతో ఇబ్బంది పడుతున్నారని ఫ్లోరిడా యూనివర్సిటీ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఈ డిజార్డర్ ఉన్న వారిలో సూర్యాస్తమయం అవ్వగానే నిరాశ, ఒంటరితనం కనిపిస్తాయట. ఈ సమస్య ఉన్నవారు ఒత్తిడి తగ్గించుకోవడానికి కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలట.