పదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన పశ్చిమబెంగాల్‌లోని సౌత్ 24 పరిగణాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నాలుగో తరగతి చదువుకుంటున్న బాలిక మృతదేహం కృపాఖాలి గ్రామంలోని గంగానది ఒడ్డున కనిపించడంతో ఆందోళనకు దిగిన ఆందోళనకారులు.. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు.శుక్రవారం రాత్రి ట్యూషన్ వెళ్లిన బాలిక శనివారం మృతదేహమై కనిపించింది.