ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌‌కు భారీ షాక్

77చూసినవారు
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌‌కు భారీ షాక్
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆమె ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో UPSC పరీక్షలు రాయకుండా ఆమెపై శాశ్వత నిషేధం విధించింది. పుణెలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించారనే అభియోగాలు తీవ్రస్థాయిలో వచ్చిన విషయం తెలిసిందే. ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో ఆమెపై వేటు పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్