తెలంగాణలోని వరంగల్ కు చెందిన నబీల్ బిగ్ బాస్ సీజన్-8 నుంచి ఆదివారం ఎలిమినేట్ అయ్యారు. టాప్-3 లో నిలిచిన నబీల్ ఎలిమినేట్ అవుతున్నట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున తెలిపారు. గెస్టుగా వచ్చిన తమిళ హీరో విజయ్, హీరోయిన్ మంజు ఆయనను హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో టాప్-2 లో నిఖిల్, గౌతమ్ మిగిలారని నాగార్జున ప్రకటించారు.