బెంగళూరుకు చెందిన ఒక ఉబెర్ బైక్ డ్రైవర్ నెలకు రూ.80,000 సంపాదిస్తున్నట్లు చెప్పారు. అతడు తన సంపాదన గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని నెల జీతం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వైరల్ వీడియోలో అతను ఉబర్, రాపిడో బైక్ డ్రైవర్ గా రోజుకు 13 గంటలు పనిచేసి నెలకు దాదాపు రూ.80,000 సంపాదిస్తున్నట్లు చెప్పారు. తనపై ఎవరూ అజమాయిషి చేయరని, తనకు తానే నేనే యజమాని అని పేర్కొన్నాడు.