క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) విలువ ఏకంగా 1,00,000 (రూ.84 లక్షలు) డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా బిట్ కాయిన్ విలువ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే గత నాలుగు వారాల్లో దీని విలువ 45శాతం పెరిగింది. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది.