బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అభిమానులు రాకుండా నిషేధం విధించారు. ఆసీస్ ప్రాక్టీస్ చేసిననప్పుడు వంద మంది కూడా రాలేదు. కానీ, టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు దాదాపు 3000 వేల మంది వచ్చారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే నెట్స్ కు చాలా దగ్గర్లో నిల్చున్నారు. తమ అరుపులు, కేకలతో ప్లేయర్లను ఇబ్బంది పెట్టారు. దాంతో ఇకపై ఇండియా ప్రాక్టీస్ సెషన్లకు రాకుండా ఫ్యాన్స్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయించారు.