మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. అయితే హోమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శాఖల కేటాయింపులు న్యాయంగా జరుగుతాయని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరారు చేస్తామని ఫడ్నవీస్ హామీ ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు షిండే అంగీకరించారు.