అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాకు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. థియేటర్ల వద్దకు చేరుకొని పార్టీ జెండాలు, వైఎస్ జగన్- అల్లు అర్జున్ ఫొటోలను ప్రదర్శిస్తు సందడి చేశార. HYD సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో థియేటర్ల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లోని ఇరువురి అభిమానులు వారి ఫొటోలకు గుమ్మడికాయలతో దిష్టి తీయడమే కాకుండా పాలాభిషేకాలు చేశారు.