హన్సిక నసనల్లి తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు అచ్చమైన తెలుగమ్మాయి. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచి అమెరికా తెలుగు వైభవాన్ని చాటారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి దాదాపు 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో హన్సిక నసనల్లి నేషనల్ అమెరికన్ మిస్ జూ. టీన్ గా నిలిచి కిరీటం అందుకున్నారు. హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు.