బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా కుమ్మక్కు అయ్యాయని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ ప్రతిని పార్లమెంటు లోపలా, బయటా చూపించేందుకు అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ ఉందన్నారు. ఇది నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని పేర్కొన్నారు. రాజ్యాంగానికి అనేక సవరణలు చేసింది వారేనన్నారు.