61కి చేరిన కల్తీ సారా మృతుల సంఖ్య

81చూసినవారు
61కి చేరిన కల్తీ సారా మృతుల సంఖ్య
తమిళనాడు రాష్ట్రంలో కళ్లకుర్చి కల్తీసారా ఘటనలో సోమవారం వరకు మృతి చెందిన వారి సంఖ్య 61కు చేరింది. 12 మంది బాధితులు పూర్తిగా కంటిచూపు కోల్పోయారు. సారా తాగి అస్వస్థతకు లోనైన వారిలో 155 మందికి ఆస్పత్రిలో ఇంకా చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన కళ్లకుర్చిలో మెథనాల్‌ కలిసిన కల్తీసారాను దాదాపు 200 మందికి పైగా స్థానికులు తాగారు. వీరిలో ఇప్పటివరకు 61 మంది చనిపోయారు.

సంబంధిత పోస్ట్