అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం హవా

74చూసినవారు
అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం హవా
అరుణా‌చల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సిక్కింలో ‘సిక్కిం క్రాంతికారి మోర్చ (SKM)’, అరుణా‌చల్ ప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. సిక్కింలో 32 స్థానాలకుగానూ 30 సీట్లలో ఎస్‌కేఎం ముందంజలో ఉంది. 60 సీట్లున్న అరుణా‌చల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఆరు, ఎన్సీపీ నాలుగు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణా‌చల్ మూడు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్