బీహార్‌లోని పాట్నాలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. మున్నాశర్మ గతంలో బీజేపీ మండల అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన నగరంలోని మంగళ్ తలాబ్ సమీపంలోని మనోజ్ కమలీయ గేట్ వద్ద ఉండగా ఉదయం 6.15 గంటలకు కొందరు చైన్ స్నాచర్లు బైక్‌పై వచ్చారు. ఆయన మెడలోని గోల్డ్ చైన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తుపాకీతో ఆయనను కాల్చి దొంగలు పరారయ్యారు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.