హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.