దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఇక బీజేపీ ఇప్పటి వరకు రెండు మ్యానిఫెస్టోలను విడుదల చేయగా.. తాజాగా మూడో మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఈ మ్యానిఫెస్టో విడుదల చేశారు. పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఆగిపోవని, బీజేపీ అన్ని హామీలు నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.