కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనను రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఉపయోగించుకుంటోందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. సీఎం మమతా బెనర్జీ ప్రతి స్పందనకు ఆయన మద్దతిచ్చారు. సీబీఐ విచారణ కోరాలన్న ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా, ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటల సమ్మెను ప్రకటించింది.