కిడ్నాప్‌కు గురైన యువకుడి మృతదేహం లభ్యం

71చూసినవారు
కిడ్నాప్‌కు గురైన యువకుడి మృతదేహం లభ్యం
TG: ఖమ్మం జిల్లాలో ఓ యువకుడి కిడ్నాప్‌ కేసు విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అన్నని తీసుకురావడానికి బస్టాండ్‌కి వెళ్లిన సంజయ్ అనే యువకుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. ఈ మేరకు తననెవరో కిడ్నాప్ చేస్తున్నారంటూ, చంపేస్తున్నారంటూ సంజయ్.. అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత ఆచూకీ లేకుండా పోయిన సంజయ్.. ఎన్ఎస్పీ కాలువలో విగతజీవిగా కనిపించాడు. మృతదేహం తమ కుమారుడిదేనని సంజయ్ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్