పదవి నుంచి తప్పుకున్న బోయింగ్ CEO

61చూసినవారు
పదవి నుంచి తప్పుకున్న బోయింగ్ CEO
USకు చెందిన దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్' కంపెనీలో కీలక పరిణామం జరిగింది. కంపెనీ CEO డేవ్ కాల్హౌన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించారు. అయితే ఈ ఏడాది చివరి వరకు ఆయనే CEOగా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత ఆయన స్థానంలో CEOగా స్టెఫానీ పోప్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు బోయింగ్ కంపెనీ ప్రకటించింది. తరచూ బోయింగ్ విమానాలు ప్రమాదానికి గురవుతున్న తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్