‘పుష్ప 2’పై బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు

57చూసినవారు
‘పుష్ప 2’పై బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రూల్‌’ సినిమాపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనిల్‌శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందన్నారు. తాజాగా టీజర్‌ వీక్షించిన ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశా. గతేడాది ఆగస్టు 15న నేను దర్శకత్వం వహించిన ‘గదర్‌ 2’ విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది అదే రోజున విడుదల కానున్న ‘పుష్ప 2’ సూపర్‌ హిట్‌ అవుతుంది.’’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్