ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

77చూసినవారు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇండిగో విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. చెన్నై నుంచి 172 మంది ప్రయాణికులతో ముంబై వెళుతున్న 6E 5314 ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన అధికారులు ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. కాగా వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you