విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

66చూసినవారు
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు
ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఆదివారం పారిస్-ముంబై మధ్య ప్రయాణించే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. పారిస్‌‌లోని చార్లెస్ డి గాలె విమానాశ్రయం నుంచి 12 మంది సిబ్బందితో సహా 306 మంది ప్రయాణికులతో UK 024 విమానం ముంబైకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే లోపల బాంబు ఉన్నట్లుగా ఎయిర్‌సిక్‌నెస్ బ్యాగ్‌పై చేతితో రాసిన నోట్ కనిపించింది. కాగా విమానాన్ని సురక్షితంగా ముంబైలో ల్యాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్