గంటల వ్యవధిలోనే టీటీడీ టికెట్లు బుక్

61చూసినవారు
గంటల వ్యవధిలోనే టీటీడీ టికెట్లు బుక్
తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. అయితే విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ నెల 20వ తేదీ నుంచి నేటి వరకు పలు దర్శనం టికెట్లను ఆన్‌లైన్లో టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లను గంటా 25 నిమిషాల వ్యవధిలో, అంగప్రదక్షణ టోకెన్లను 2 నిమిషాల 30 సెకెన్లలోనే భక్తులు బుక్ చేశారు. ఇతర టికెట్లు సైతం గంటల్లోనే అమ్ముడుపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్